కారణం లేకుండా నిద్రపట్టక ఇబ్బంది పడే వారు. పడుకొన్న వెంటనే హాయిగా
నిద్రపట్టాలని భావించేవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. హాయిగా నిద్ర
పట్టడానికి కొన్ని చేయాల్సిన పనులుంటే మరికొన్ని చేయకూడని పనులు వున్నాయి.
ముందుగా రాత్రివేళ హాయిగా నిద్రపట్టడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు,
చేయాల్సిన పనులు గురించి చెప్పుకొందాం.
చేయాల్సిన పనులు:
- పగటి పూట ఖాళీగా వుండకుండా ఏదో ఒక పనిచేయాలి. పగటివేళ శరీరానికి తగిన వ్యాయామం లేదా పని వుండాలి. పగటివేళ కష్టించి పనిచేసేవారికి రాత్రివేళ హాయిగా సుఖవంతమైన నిద్రపడుతుంది.
- రాత్రివేళ ఒక సమయానికి నిద్ర పోవడం తోపాటు ఒకే సమయానికి నిద్రలేచే విధంగా అలవాటు చేసుకోవాలి. ఆ విధంగా అలవాటు చేసుకోవడం వల్ల సమయానికి ఆకలివేసినట్లు గానే సమయానికి నిద్రకూడా వస్తుంది.
- పడకగది శుభ్రంగాను గాలి లభించే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. పడక గది దుర్వాసన వస్తూ చిందర వందరగా వుంటే నిద్రపట్టకపోగా చిరాకుతో నిద్రమరింత దూరం అవుతుంది.
- ఉదయం వేళ ఒకే సమయానికి నిద్రలేచే విధంగా అలారమ్ పెట్టుకోవాలి. రాత్రి ఒకే సమయానికి నిద్రపోవడం ఎంత అవసరమో ఒకే సమయానికి నిద్రలేవడం కూడా అంతే అవసరం. అందువల్ల ప్రతిరోజు నిర్ణీత సమయా నికి నిద్రలేచే విధంగా అలారమ్ పెట్టుకోవడం మంచిది.
- బెడ్‌లైట్ తక్కువ వెలుతురు వుండాలి. కొంత మంది చీకటిలో నిద్రించకూడదని బెడ్‌లైట్ తప్పని సరిగా వుండాలనే సెంటిమెంట్ వుంటుంది. బెడ్‌లైట్‌వేసుకొనే వారు బెడ్‌లైట్ కంటికి ఎదురు గుండా వుండకుండా చూసుకోవాలి. అవకాశం వుంటే బెడ్‌లైట్ పడుకొనే మంచానికి దిగువ భాగంలో వుండే విధంగా ఏర్పాటు చేసుకోవాలి.
- ఉదయం నిద్రలేచే వరకు ముఖంపై వెలు తురు పడకుండా జాగ్రత్త తీసుకోవాలి. వెలుతురు నిద్రకు ఇబ్బంది కలిగిస్తుంది. కొంతమంది బయట గాలివీస్తోందనో. లేక ప్రశాంతంగా వుందనో ఆరుబయట లేదా కిటికీి పక్కన పడు కొంటారు. అయితే ఉదయం సూర్యోదయం కావడంతోనే వెలుతురు ముఖం మీద పడి నిద్రకు ఇబ్బంది కలుగుతుంది.
- ఇక హాయిగా నిద్రపట్టాలంటే కొన్ని పనులు చేయకూడదు. ప్రధానంగా ఖాళీ సమయం దొరికితే మంచం ఎక్కేయడం, సెలువు రోజున అదే పనిగా నిద్ర పోవడం చేయకూడదు. ఇటు వంటి అంశాలు ఇతరులకు ఎటువంటి ఇబ్బంది కలిగించక పోయినా మనకి మాత్రం ఇబ్బంది కలిగిస్తాయి. అందువల్ల హాయిగా నిద్రపట్టా లనుకొనేవారు ఈ కింద తెలిపే పనులు చేయకూడదు.
- పగటిపూట ఎక్కువసేపు నిద్రపోకూ డదు. పగటి పూట ఎక్కువ నిద్రపోతే రాత్రి వేళ ఆలస్యంగా నిద్రపట్టడమే కాకుండా, పట్టిన నిద్రకూడా కలత నిద్రగా వుంటుంది.
- పడకపై ఎక్కువ వుండకూడదు. కొంత మంది ఖాళీ దొరికితే చాలు వెంటనే పక్క ఎక్కేస్తారు.ఖాళీగా వుంటే కుర్చీలో కూర్చోవాలే గాని మంచంపై పడుకో కూడదు. పగలు, రాత్రి తేడాలేకుండా మంచంపై పడుకోవడం వల్ల రాత్రి నిద్ర పోయే సమయానికి కూడా పగటి పూట కాల క్షేపం చేసినట్టుగానే వుండి నిద్రపట్టకుండా పోతుంది.
- కొంత మంది సెలవు దొరికితే చాలు ఇక ఆరోజంతా ఆదే పనిగా నిద్రపోతుంటారు. మరికొంతమంది ఆలస్యంగా నిద్రలేస్తారు. దీనివల్ల నిద్రకు సంబంధించిన టైమ్‌టేబుల్‌లో మార్పువచ్చి అసలు నిద్రపట్టకుండా పోతుంది.
- పగటి వేళల్లో అతిగా టీ, కాఫీలు తాగకూడదు. ముఖ్యంగా నిద్రపోవడానికి ఒక గంటముందు అసలు తాగకూడదు. కాఫీ,టి లలో కెఫిన్ అనే ఉత్ప్రేరకం వుంటుంది. దీనివల్ల నిద్రకు భంగం కలుగుతుంది.
- నిద్రపోవడానికి ముందు సమయం కాని సమయంలో ఎటువంటి ఆహారం తీసుకోకూడదు.
- పడక ఎక్కే సమయంలో టెలివిజన్ చూడడం కాని, రేడియో వినడం కాని చేయగూడదు.
- సీరియస్ అంశాలు వుండే పుస్తకాలు చదవ కూడదు. కబుర్లు చెప్పుకోకూడదు.
- నిద్రరాకుండా మంచం ఎక్కకూడదు.. నిద్ర వచ్చినప్పుడు మాత్రమే పడుకోవడానికి ఉపక్రమించాలి.
- పడక గదిని ఇతరత్రా అవసరాలకు (శృంగారానికి మినహాయింపు) వినియోగించ కుండా వుంటే బాగుంటుంది.
- పడుకున్న తరువాత 20 నుంచి 30 నిమిషాల్లో నిద్రపట్టకపోతే బెడ్‌రూమ్ నుంచి బయటకు వచ్చి వారపత్రికలు తిరగవేయడం వంటి టైమ్‌పాస్ చేసి, ఆ తర్వాత నిద్రవచ్చే సమయంలో బెడ్‌రూమ్‌కు రావాలి.
- ఇటువంటి జాగ్రత్తలతో పాటు నిద్రపోవడానికి ముందు సిగరెట్, బీడి, చుట్ట వంటివి తాగకూడదు. అదే విధంగా గంట ముందుగా ఎటువంటి ఎక్సైర్‌సైజ్‌లు చేయకూడదు.
0 Comments