Full Style

>

డయాబెటిస్‌కు ఉత్తమ పరిష్కారం

డయాబెటిస్ అదుపులో ఉన్నంత వరకు ఏ సమస్యా లేదు. నియంత్రణలో లేకపోతే అది అనేక దుష్ప్రభావాలకు దారితీస్తుంది. హోమియోపతిలో ఇచ్చే కానిస్టిట్యూషనల్ చికిత్స ద్వారా డయాబెటిస్ వల్ల దుష్ప్రభావాలకు అడ్డుకట్ట వేయవచ్చని, ఫలితంగా ఆనందకరమైన జీవితం గడపవచ్చని అంటున్నారు డాక్టర్ టి.కిరణ్‌కుమార్.

డయాబెటిస్ అనేది వ్యాధి కాదు. ఇది ఒక మెటబాలిక్ డిజార్డర్. శరీరంలో జీవక్రియ సరిగ్గా జరగకపోవడం వల్ల రక్తంలో, మూత్రంలో చక్కెర శాతం పెరిగిపోవడం వల్ల ఏర్పడే స్థితి మాత్రమే. డయాబెటిస్ లక్షణాలైన అధిక మూత్రం, తీవ్రమైన దాహం, ఆకలి, శారీరక దౌర్బల్యం అన్నీ కూడా జీవక్రియ సరిగ్గా జరగకపోవడం వలన వచ్చేవే. దీనికి కారణం శరీరంలో పాంక్రియాస్ అనే గ్రంథి నుంచి వెలువడే ఇన్సులిన్ హార్మోన్ సరిగ్గా ఉత్పత్తి కాకపోవడం లేదా దానిని శరీరం సరిగ్గా వినియోగించుకోకపోవడమే. ఇన్సులిన్ ఉత్పత్తిని ఆధారంగా చేసుకొని డయాబెటిస్‌ను రెండు రకాలుగా విభజించారు.
డయాబెటిస్‌లో ఇన్సులిన్ ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోవడం లేదా పూర్తిగా ఆగిపోవడం జరుగుతుంది. దీనికి కారణం పాంక్రియాటైటిస్ వంటి ఇన్‌ఫెక్షన్ వల్ల లేదా అటోఇమ్యూనిటీ వల్ల పాంక్రియాస్ గ్రంథిలో బీటాకణాలు పూర్తిగా నాశనం కావడమే. ఇన్సులిన్ ఉత్పత్తి నిలిచిపోవడం వల్ల శరీరంలో కార్బోహైడ్రేట్ మెటబాలిజమ్ దెబ్బతిని మనిషి స్పృహకోల్పోయి కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంది. అందువల్ల వీరిలోకి బయట నుంచి ఇన్సులిన్‌ని ఇంజక్షన్ రూపంలో ప్రవేశపెడతారు. అందుకే ఈ రకం డయాబెటిస్‌ని "ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటిస్ మెల్లిటస్''(ఐడీడీఎమ్) అని అంటారు.
ఈ రకమైన డయాబెటిస్‌లో ఇన్సులిన్ ఉత్పత్తి సరిగ్గానే ఉన్నప్పటికీ శరీరం దానిని సరిగ్గా వినియోగించుకోలేని పరిస్థితి ఉంటుంది. దీన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. ఇది సాధారణంగా ఊబకాయం ఉన్న వారిలో, మద్యం సేవించేవారిలో, శారీరక శ్రమ లేకుండా స్థిరంగా ఉండే వారిలో ఎక్కువగా చూస్తూ ఉంటాం. వీరికి ఇన్సులిన్ బయటి నుంచి ఇచ్చే అవసరం ఉండదు. కానీ రక్తంలో చక్కెర శాతాన్ని నియంత్రించే మందులను (యాంటీ హైపర్‌గ్లైసీమిక్ డ్రగ్స్) సూచిస్తారు. అందుకే దీనిని నాన్-ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటిస్‌మెల్లిటస్ (ఎన్ఐడీడీఎమ్‌ఖ) అని అంటారు. అయితే వీరిలో కూడా షుగర్‌లెవెల్స్‌ను టాబ్లెట్ల ద్వారా నియంత్రించలేకపోతే ఇన్సులిన్ ఇంజక్షన్ సిఫారసు చేస్తారు. స్త్రీలలో గర్భధారణ సమయంలో వచ్చి ఆ తరువాత కూడా ఉండే డయాబెటిస్‌ని 'జెస్టేషనల్ డయాబెటిస్'' అంటారు.
కాంప్లికేషన్స్
డయాబెటిస్ వలన వచ్చే లక్షణాలే ఇబ్బందికరంగా ఉంటే దానివల్ల తలెత్తే కాంప్లికేషన్లు రోగిని మరింత కుంగదీస్తాయి. కొన్నిరకాల కాంప్లికేషన్లు అకస్మాత్తుగా, తీవ్రంగా వస్తాయి. షుగర్‌లెవెల్స్‌ను నియంత్రించకపోతే 'డయాబెటిక్ కీటోఎసిడోసిస్' అనే సమస్య తలెత్తుతుంది. మందులు వేసుకుంటూ ఆహారం సరిగ్గా తీసుకోకపోతే చక్కెర స్థాయి తగ్గిపోయి 'హైపోగ్లైసీమియా' తలెత్తుతుంది. శరీరమంతా చెమటలు రావడం, వణుకురావడం, విపరీతమైన నీరసానికి గురై కళ్లు తిరిగిపడిపోవడం వంటి లక్షణాలు హైపోగ్లైసీమియాకి గురైన వ్యక్తిలో కనిపిస్తాయి. కొన్ని రకాల దుష్ప్రభావాలు దీర్ఘకాలం వేధిస్తాయి. రక్తనాళాలలో వచ్చేమార్పుల వల్ల గుండె జబ్బులు, కంటి చూపు మందగించడం, మూత్రపిండాలు దెబ్బతినడం వంటివి కనిపిస్తాయి. తరచుగా కనిపించే సమస్య న్యూరోపతి. దీనివల్ల అరికాళ్లలో చేతుల్లో మంటలు, తిమ్మిర్లు, చీమలు పాకుతున్నట్లు ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
ఏం చేయాలి?
కాంప్లికేషన్స్‌ను అరికట్టడానికి రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోవలసిన అవసరం ఉంది. గ్లూకోజ్ లెవెల్స్ సాధారణంగా భోజనం చేసిన తరువాత 160 ఎంజి/డీఎల్ కన్నా తక్కువ ఉండేలా చూసుకోవాలి. కొంతమందిలో రక్తంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రించుకున్నా గానీ క్లాంప్లికేషన్స్ మొదలవుతాయి. అందుకే వ్యాయామం చేస్తూ మందులు వేసుకుంటూ చిన్న చిన్నజాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
హోమియో చికిత్స
హోమియోపతిలో ఇచ్చే కాన్స్‌టిట్యూషనల్ చికిత్స ద్వారా రోగి ప్రతీ సమస్యను అదుపు చేయవచ్చు. ఈ చికిత్స ద్వారా కేవలం షుగర్ లెవెల్స్‌కంట్రోల్ చేయడమే కాకుండా కాంప్లికేషన్స్‌ను నివారించడం, ఉన్న వారిలో కాంప్లికేషన్స్‌ని తొలగించడం జరుగుతుంది. హోమియోపతి అనగానే డయాబెటిస్‌కి యాసిడ్‌ఫాస్, యురేనియమ్ నైట్ వంటి మందులు ఉన్నాయని అనుకుంటారు. ఇది సరియైనది కాదు. జన్యుపరమైన, మానసిక పరమైన కారణాలను పరిగణిలోకి తీసుకుని, వ్యక్తిగత లక్షణాలపై కేంద్రీకరిస్తూ ఇచ్చే కాన్స్‌టిట్యూషనల్ రెమెడీ ద్వారా రోగికి చక్కని ఫలితం లభిస్తుంది. సరియైన మందును, సరియైన మోతాదులో నిర్ణీతకాలం దాకా వాడితే రోగుల్లో ఇన్సులిన్ డోస్‌ని తక్కువ చేయడం, యాంటీహైపర్ గ్లైసమిక్ డ్రగ్స్ మోతాదుని క్రమంగా తక్కువ చేయడం జరుగుతుంది. హోమియోపతి మందుల ద్వారా డయాబెటిక్ రోగులు ఆరోగ్యకరమైన, ఆనందకరమైన జీవితాన్ని సొంతం చేసుకోవచ్చు.

Post a Comment

0 Comments