Full Style

>

రోజంతా హుషారుగా ఉంచే గ్రీన్ టీ



గ్రీన్ టీ: రోజంతా హుషారుగా ఉండాలంటే.. ప్రతిరోజూ కప్పు గ్రీన్ టీ తాగాలి. వీటిలోని పోషకాలు శరీరానికి శక్తినందిస్తాయి. ఆరోగ్యకరం కూడా.. అలసిపోయినప్పుడు టీ తాగితే రిఫ్రెష్ అవుతారు. నిరాశా నిస్పృహలకు లోనైనప్పుడు మనకు ఆలంబనగా నిలిచి మానసికోల్లాసానికి మార్గంగా మారుతుంది టీ. అలాంటి ఈ టీస్థానంలో గ్రీన్‌ టీ వచ్చింది. మామూలు టీకన్నా గ్రీన్ టీ తాగితే శరీరానికి చాలా మంచిది.

గ్రీన్‌ టీ తాగడం వల్ల ఎక్కువకాలం ఆరోగ్యంగా జీవించడానికి కీలకపాత్ర పోషిస్తుంది. సుదీర్ఘకాలం పాటు చెప్పుకోదగినంతగా ఆరోగ్య లాభాలు చేకూర్చిపెడుతుంది. గ్రీన్‌ టీలో ఖనిజాలు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. గ్రీన్‌టీ లేదా హెర్బల్ టీలో ఉండే క్యాటెచిన్ అనే రసాయనం మన శరీరంలోని విషపూరితమైన కాలుష్యాలను బయటకు వెళ్లేలా తోడ్పడుతుంది. ఇందులోని పాలీఫినాల్స్ అనే పదార్థాలు శరీరంలో రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తాయి.

Post a Comment

0 Comments