Full Style

>

గౌట్‌ కీళ్ళ వ్యాధి!

గౌట్‌ అనేది శరీరంలో యూరిక్‌ ఆమ్లం జీవ ప్రక్రియ సరిగా లేనందున ఉత్పమన్నమయ్యే ఒక కీళ్ళ వ్యాధి.

కారణాలు:
Goutaకాలి బొటనవేలిపై గౌటు సాధారణంగా మన రక్తంలో ‘యూరిక్‌ ఆమ్లం’ అనే రసాయనం ఉంటుంది. అది ఉండాల్సిన దానికంటే కూడా ఎక్కువగా ఉంటే... కీళ్ళలోకి వచ్చి చేరుతుం టుంది. ఇలా కీలు దగ్గర యూరిక్‌ ఆమ్లం స్ఫటికాలు ఎక్కువగా పేరుకుంటున్నప్పుడు కీలు వాచి, కదలికలు కష్టంగా తయారవు తాయి. దీన్నే గౌట్‌ అని లేదా గౌటీ ఆర్థ్రైటిస్‌ అని అంటారు. దీని వల్ల కీలు నొప్పి, వాపు, ఎరుపుదనం వంటి బాధలు మొదలవుతాయి. సాధారణంగా ఈ సమస్య కాలి బొటనవేలు వాపుతో ఆరంభమవుతుంది. మొదట్లో ఏమంత ఎక్కువగా బాధించదు. మందులు వాడినా, వాడకపోయినా కూడా.. దానంతట అదే వారం పది రోజుల్లో తగ్గిపోవచ్చు.

తర్వాత ఐదారు నెలల పాటు మళ్ళీ రాకపోవచ్చు. కానీ క్రమేపీ ఏడాదికి రెండు మూడుసార్లు, తర్వాత మూడు, నాలుగుసార్లు బాధలు వస్తూ.. క్రమంగా తరచుదనం, తీవ్రతా పెరుగుతుంటాయి. పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తే ఇది దీర్ఘకాలిక సమస్యగా తయారై... జాయింట్లను బాగా దెబ్బ తీసేస్తుంది. కాబట్టి మొదటిసారి వాపు వచ్చినప్పుడే చికిత్స ఆరంభిస్తే... తర్వాత ఏ సమస్యా లేకుండా, కీళ్ళు దెబ్బ తినకుండా చూసుకోవచ్చు. నిజానికి కీళ్ళ సమస్యలన్నింటిలోకి ‘గౌట్‌’ చికిత్స చాలా తేలిక. కేవలం ఒకే ఒక్క మాత్రతో దీనికి చికిత్స చేయవచ్చు. కాకపోతే ఈ మాత్రను జీవితాంతం తీసుకోవాల్సి ఉంటుంది.

రోగ నిర్ధారణ:
మోకాలిపై వచ్చిన దీర్ఘకాలిక గౌటు. రక్తంలో యూరిక్‌ ఆమ్లం ఎక్కువ ఉన్నంత మాత్రాన గౌట్‌ ఉన్నట్లేనని భావించరాదు. యూరిక్‌ ఆమ్లం ఎక్కువగా ఉండటంతో పాటు కీళ్ళలో సమస్యలు, ఆర్థ్రైటిస్‌ లక్షణాలు కూడా ఉన్నప్పుడే దాన్ని గౌట్‌గా భావించాల్సి ఉంటుంది. రక్తంలో యూరిక్‌ ఆమ్లం ఎక్కువగా ఉన్నా కూడా... కీళ్ళ బాధలేమీ లేకపోతే దాన్ని గౌట్‌గా భావించకూడదు. అలాగే మరికొన్ని ఇతరత్రా సందర్భాల్లో కూడా యూరిక్‌ ఆమ్లం ఎక్కువగా ఉండోచ్చు. ఉదహరణకు ‘సొరియాటిక్‌ ఆర్థ్రైటిస్‌’ అనే సమస్యలో కూడా యూరిక్‌ ఆమ్లం ఎక్కువగా ఉండోచ్చు. కానీ దాని చికిత్స వేరు. అల్లోప్యూరినాల్‌తో వారికి ఉపయోగం ఉండదు. అలాగే లుకీమియా, కిడ్నీ ఫెయిల్యూర్‌ వంటి సమస్యల్లో కూడా యూరిక్‌ ఆమ్లం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి... గౌట్‌ విషయంలో రోగ నిర్ధారణ చాలా కీలకం. సమస్య నిర్ధారిస్తేనే చికిత్సతో ఫలితం ఉంటుంది.

రక్తంలో యూరిక్‌ ఆమ్లం ఎక్కువగా ఉండటంతో పాటు... రోగి బాధలు కూడా గుర్తించే గౌట్‌ను నిర్ధారిస్తారు. గౌట్‌ లక్షణాలు చాలా ప్రస్పుటంగానే ఉంటాయి. ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు వరకూ కూడా ఎలాంటి సమస్యా ఉండ దు. ఉదయం లేచే సరికి కాలి బొటన వేలు విపరీతంగా వాచి, ఎర్రగా తయారవుతుంది. ముట్టుకుంటే భరించలేని నొప్పి. నొప్పి తగ్గేందుకు ఏవో మాత్రలు వేసుకుంటే వారం పది రోజుల్లో అదే పోతుంది. ఇది గౌట్‌ ప్రధాన లక్షణం. అప్పుడు మనం ఆ కీలు నుంచి కొద్దిగా నీరు తీసి పరీక్షిస్తే... దానిలో యూరిక్‌ ఆమ్లం పలుకులు (క్రిస్టల్స్‌) స్పష్టంగా కనిపిస్తాయి. దీంతో గౌట్‌ నిర్ధారణ అయినట్టే.

మొదట్లో ఇది కాలి బొటన వేళ్ళ వంటి ఏదో ఒకటి రెండు కీళ్ళకు పరిమితమైనా క్రమేపీ ఇతరత్రా జాయింట్లకు కూడా వస్తుంది. ఈ దశలో... అది గౌటీ ఆర్థ్రైటిస్సా? లేక రుమటాయిడ్‌ ఆర్థ్రైటిస్సా? అన్నది తేల్చుకోవడం ముఖ్యం. అందుకని రుమటాయిడ్‌ ఫ్యాక్టర్‌, యూరిక్‌ ఆసిడ్‌ పరీక్షలు, వీటితో పాటు కిడ్నీ పరీక్షలు, రక్తంలో ఈఎస్‌ఆర్‌ పరీక్ష కూడా చేయిస్తారు. వాచిన కీలు ఎక్స్‌రే తీయిస్తే ప్రారంభదశలో అది మామూలుగానే ఉన్నా... తర్వాత తర్వాత మదుకణజాలంలో వాపు కనిపిస్తుంది. గౌట్‌ సమస్య ఉన్న వారికి చెవి తమ్మెల వంటి చోట కూడా స్ఫటికాలు పేరుకుని, పైకి తెల్లగా కనబడుతుంటాయి. ఇది కూడా సమస్య నిర్ధారణకు ఉపయోగపడుతుంది.

గౌట్‌కు ‘అల్లో ప్యూరినాల్‌’ (జైలోరిక్‌) ఒక్కటే మందు. ఈ మందు ఆరంభస్తే అక్కడక్కడ పేరుకున్న యూరిక్‌ ఆమ్లం మోతాదు కూడా క్రమేపీ తగ్గిపోతుంది. కీళ్ళ సమస్యలు బాధించవు. మందు ఆరంభించక పోతే మాత్రం కీళ్ళు మరింతగా వాచి, కీళ్ళ మీద పుండ్లు పడి, క్రమేపీ జాయింట్లు దెబ్బతింటాయి.గౌట్‌ బాధితులు మాంసకృతులు తగ్గిం చాలి, మరీ ముఖ్యంగా ‘హైప్యూరిన్‌ డైట్‌’ తీసుకోకూడదు. మామూలుగా మాంసకృతులు (ప్రొటీన్లు) రెండు రకాలు. 1. ప్యూరి న్స్‌, 2. పిరమిడీన్స్‌. గౌట్‌ బాధితులు ప్యూరీ న్స్‌ రకం ప్రొటీన్లు ఎక్కువగా తీసుకోకూడదు. మేక, గొర్రె, బీఫ్‌ వంటివి తీసుకోకూడదు. లివర్‌, కిడ్నీ, ఎముకల మూలగ, పేగుల వంటి జంతువుల అంతర్గత అవయవాలూ తీసుకోకూడదు. శాకాహారాల్లో పాలకూర, క్యాబేజీ, క్యాలీఫ్లవర్‌, చిక్కుళ్ళు, బీన్స్‌ రకాలు, పుట్టగొడుగులు బాగా తగ్గించాలి. ఆల్కహాల్‌, బీరు వంటి వాటికి దూరంగా ఉండటం కూడా అవసరం.

Post a Comment

2 Comments

  1. Sir my uric acid levels is normally but my toe is pain and swelling why?

    ReplyDelete
  2. Sir my uric acid levels is normally but my toe is pain and swelling why?

    ReplyDelete