పసిపిల్లలు... నవ్వుతూ, కేరింతలు కొడుతూ ఆటలాడుతూ ఉంటేనే
తల్లిదండ్రు లకు ఆనందం... అది అందం. కానీ ముక్కు పచ్చలారని చిన్నారులు
స్పృహలేని స్థితిలో నీరసంగా, ముఖం మీద ఆక్సిజన్ మాస్క్‌తో, ఒళ్ళంతా ఐ.వి.
తీగలతో, ఆసుపత్రి ఐ.సి.యులో చూసినప్పుడు గుండె తరుక్కుపోతుంది. ఆ సమయంలో
అన్నెంపన్నెం ఎరుగని పసివాళ్ళకు అంతటి కష్టాన్నిచ్చిన భగవంతుడి మీద కోపం
రాకమానదు.
మనదేశంలో ప్రతి ఏటా 2 లక్షల మంది పిల్లలు పుట్టుకతోనే కంజెనిటల్ హార్ట్ డిసీజ్‌తో పుడుతున్నారు. వీరిలో కేవలం 2 శాతం పిల్లలకు మాత్రమే సమయానికి, సరైన వైద్యం అందుతోంది. పెద్దవాళ్ళ అజ్ఞానం, ఆర్థిక సమస్యలతో మిగిలిన వారంతా ఏ విధమైన వైద్యం తీసుకో కుండానే ప్రాణాలు కోల్పోతున్నారు. చిన్న వయసులోనే ఈ గుండెజబ్బు రావడానికి ముఖ్యంగా గర్భస్థ దశలోనే సోకే వైరస్ ఇన్‌ఫెక్షన్‌లు ప్రధాన కారణం. జెనెటిక్ లోపాలు కూడా పసి పిల్లలకు గుండెజబ్బులను తెచ్చి పెడుతున్నాయి. పాశ్చాత్య దేశాల్లో స్ర్తీలు గర్భంతో ఉన్నప్పుడు ధూమపానం, మద్యపానం చేయడం వలన ఆ ప్రభావంతో పుట్టే పిల్లలకు గుండె జబ్బులు వస్తున్నాయి.
ఈ విధంగా కంజెనిటల్ గుండె జబ్బులతో పుట్టిన పిల్లలు తమ తొలి పుట్టిన రోజును కూడా జరుపుకోలేరు. దీనికి ప్రధాన కారణం అజ్ఞానం అని తెలిసినప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. కానీ ఇది నిజం. ఎందుకంటే నెలల పిల్లలకి కూడా గుండె జబ్బులు వస్తాయని సమాజం నమ్ముతుంది.పసి పిల్లలు గుండె జబ్బులపాలు కాకుండా చూసుకోవలసిన బాధ్యత పెద్దవాళ్ళదే. ఇందుకు ప్రధానంగా తల్లిదండ్రులు పిల్లల్లో కనిపించే కొన్ని లక్షణాలు గుండెజబ్బుకి హెచ్చరికలుగా భావించి జాగ్రత్త పడాలి.
గమనించవలసినవి:
- బిడ్డ పాటు తాగేప్పుడు ఇబ్బంది పడుతున్నాడా?
- శ్వాస తీసుకోవడంతో ఇబ్బంది పడుతున్నాడా?
- బరువు పెరగడం లేదా?
- ఎక్కువగా ఆయసపడుతున్నాడా?
- పెదవులు, వేళ్ళు నీలి రంగులో వున్నాయా?
- తరచుగా నిమోనియాకి గురౌతున్నాడా?
ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే కార్డియాలజీ స్పెష్టలిస్టుని సంప్రదించడం అవసరం.
చేసే పరీక్షలు - ఎలక్ట్రోకార్డియోగ్రామ్, ఎక్స్‌రే, 2డి ఎకొ, కలర్ డాప్లర్, కార్డియాక్ కేథరైజేషన్ (అవసరమైతే).
గుండె జబ్బులను మూడేళ్ళ వయసులోపే చికిత్స సరి చేయాలి. లేకపోతే భవిష్యత్తులో అది ప్రాణాంతకమ వుతుంది. అంతేకాకుండా స్కూల్లో చేరిన పిల్లలు మిగిలిన పిల్లలాగే చదువుతో, ఆటపాటల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది.
నెలల వయసున్న పిల్లలకు వచ్చే పల్మనరీ వాల్వ్ స్టినోసిస్, ఆర్టిక్ వాల్వ్ స్టినోసిస్ జబ్బుల్ని మొదటి నెలలోనే చికిత్స చేయవచ్చు. అలాగే గుండెలో ఏర్పడే రంధ్రాల్ని కూడా మూసివేయవచ్చు. ఒక్కోసారి రక్తనాళాలు మూసుకుపోవడం కూడా లేత గుండెల్లో సంభవించవచ్చు. వాటిని కూడా స్టంటింగ్ ద్వారా సిఒఎ, పల్మనరీ ఆర్టరీ స్టెనోసిస్ ద్వారా ప్రిక్రియతో చికిత్స చేయవచ్చు. తర్వాత దశలో పూర్తిగా సరిచేయవచ్చు.
ఒకప్పుడు పసివాళ్ళలో కంజెనిటల్ గుండె జబ్బులకు ఏ విధమైన నిర్ధారణ ఉండేది కాదు. కానీ, నేటి ఆధునిక వైద్య శాస్త్రంలో ఈ జబ్బులకు చక్కని పరిష్కారం ఉంది. - పుట్టుకతో వచ్చే గుండె జబ్బులకు మూలకారణం గర్భస్థ దశలో గుండె.
- నిర్మాణంలో, గుండెకు దగ్గరలోనే రక్తనాళాల్లో కలిగిన లోపాలు ప్రతి వెయ్యి శిశువుల్లో 8 మంది గుండె లోపాలతో పుడుతున్నారు.
- తల్లి గర్భంలో ఉన్న శిశువుకి గుండె జబ్బు ఉన్నా తట్టుకుంటుంది కానీ పుట్టిన తర్వాత తట్టుకోలేదు.
0 Comments