సైనసైటిస్ పాథోఫిజియాలజి
ప్రాథమిక దశలో రోగి జలుబు, దగ్గు, ముక్కు మూసుకుపోవడం, అలర్జీ సమస్యలతో బాధపడతాడు. ప్రాథమిక దశలో సకాలంలో సక్రంమంగా వైద్యం చేయించకుంటే అలర్జీతో ఇతర రకాల రుగ్మతలకు దారితీస్తుంది. ఇన్‌ఫెక్షన్ వల్ల ముక్కు మూసుకుపోతుంది. సైనసైటిస్ సమస్య అలర్జీక్ బ్రాంకైటిస్, ఆస్తమాలతో పాటు ఊపిరితిత్తుల సమస్యలు కూడా ఏర్పడే ప్రమాదముంది.
సాధారణ లక్షణాలు
సైనసైటిస్ వల్ల ముక్కులో నుంచి పసుపురంగు, పచ్చరంగులో శ్లేష్మం వస్తుంటుంది. ముఖం నొప్పితోపాటు ముక్కు మూసుకు పోవడం, తలనొప్పి సమస్యతో సతమతమవుతుంటారు. వాసనను గుర్తించే సామర్థ్యం తగ్గిపోతుంది. జ్వరంతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. పెద్దవారిలో తీవ్రమైన దగ్గు వస్తుంటుంది. అందులోనూ పగలు సమస్య ఎక్కువగా ఉంటుంది. చెవి నొప్పి, ఒత్తిడి, ముక్కులో నుంచి చెడు వాసన రావటం, పళ్ల నొప్పి మొదలగు సమస్యలు సాధారణంగా సైనసైటిస్ వ్యాధి గ్రస్థులకు వస్తుంటాయి.
అక్యూట్ సైనసైటిస్:
జలుబుతో వచ్చే ఇన్ఫెక్షన్‌లతో తీవ్రమైన సైనసైటిస్‌కు దారితీయవచ్చు. వైరస్
వల్ల ఏర్పడే సైనస్ సమస్యతో ముక్కు రంద్రం సైజు తుగ్గుతుంది. ముక్కులో నుంచి
ఎక్కువగా శ్లేష్మం బయటకు వస్తుంటుంది. ముక్కుదిబ్బడగా ఉండటం అక్యూట్
సైనసైటిస్ పిల్లల నుంచి పెద్దల దాకా అందరికీ వస్తుంటుంది. పెద్దవారిలో
ముక్కు మూసుకుపోవడం, అధిక శ్లేష్మం రావటం, ముక్కు ఎర్రగా కందిపోవడం,
కళ్లనొప్పి, తుమ్ములు రావటం, తల బరువుగా ఉండటం, ఒళ్లు నొప్పి సమస్యలు
వస్తుంటాయి. చిన్న పిల్లల్లోనూ సాధారణంగా జలుబు వల్ల ముక్కు
మూసుకుపోతుంటుంది. పిల్లలకు నిరంతరాయంగా పది రోజుల పాటు లోజ్వరం ఉండటం,
రంగుతో కూడిన శ్లేష్మం ముక్కు నుంచి కారుతూంటుంది. అలర్జీ వల్ల కూడా
పిల్లలకు సైనసైటిస్ సమస్య తీవ్రమవుతుంది.
దీర్ఘకాల సైనసైటిస్
ముక్కులో నుంచి తీవ్రంగా నీరుకారుతుండటం, తీవ్ర వాపు, మూడునెలల కంటే ఎక్కువగా ఇన్‌ఫెక్షన్ ఉంటే దీర్థకాల సైనసైటిస్ సమస్య ఉందని గుర్తించాలి. అలర్జీలు, ఫంగస్, ఇన్ఫెక్షన్‌ల వల్ల ముక్కులో కండ పెరిగి నాజల్ పాలిప్స్ ఏర్పడుతుంటాయి. క్రానిక్ సైనసైటిస్‌లో ముక్కులో నుంచి శ్లేష్మం ఆకుపచ్చ, పసుపురంగులో కారుతుంటుంది. సైనస్ ఇన్‌ఫెక్షన్‌లకు సాధారణంగా మెర్కురీయస్ సాల్, సిల్సియా, కలిబొక్షికోమియమ్, ఫాస్పరస్, నక్స్‌వామికా, మెగ్నీషియంకర్బ్ లాంటి హోమియోపతి మందులు అందుబాటులో ఉన్నాయి. అనుభవజ్ఞులైన హోమియోవైద్యుల పర్యవేక్షణలో హోమియోచికిత్స తీసుకుంటే సైనసైటిస్ శాశ్వతంగా దూరం అవుతుంది.

0 Comments