* చలికాలంలో
పెదాలు, శరీరంపై పగుళ్ళు ఏర్పడుతుంటాయి. దీంతోపాటు మంటగాకూడా ఉంటుంది.
కాబట్టి ఉదయం, రాత్రి రెండు పూటలా కొబ్బరి నూనెను పూయండి. దీంతో పగుళ్ళు
తగ్గడంతోపాటు మంట కూడా తగ్గి ఉపశమనం కలుగుతుంది.
*
పగిలిన పాదాలకు రాత్రి పడుకునే ముందు పెట్రోలియం జెల్లీతోపాటు కొబ్బరి
నూనెను కలిపి మాలిష్ చేయండి. ఉదయం స్నానం చేసే సమయంలో గోరవెచ్చటి నీటిలో
కాళ్ళు కడుక్కోండి. దీంతో పగుళ్ళలో ఉపశమనం కలుగుతుంది.
*
ముఖంపై ఎలాంటి మచ్చలు లేకుంటే అందంగాను చూసేందుకు బాగుంటుంది. కాని ఏవైనా
మచ్చలు ఏర్పడుతుంటే నలుగురిలో తిరిగేందుకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. దీనికి
అరచెంచా కొబ్బరి నూనెలో అరచెక్క నిమ్మకాయ రసం కలుపుకోండి. ఈ మిశ్రమాన్ని
ముఖానికి, మోచేతులపై రుద్దండి. కాసేపయ్యాక గోరువెచ్చటి నీటితో కడిగేయండి.
ఇలా వారం రోజులపాటు చేస్తుంటే మచ్చల నుంచి ఉపశమనం కలుగుతుంది.
*
కళ్ళపై వేసుకున్న మేకప్‌ను శుభ్రం చేసేందుకు కాటన్ బాల్ పై కాసింత కొబ్బరి
నూనెను పోసి ఆ దూదిని మెల్లగా కళ్ళపై రుద్ది మేకప్‌ను శుభ్రం చేసుకోండి.
*
కొబ్బరి నూనెను స్నానానికి ముందు, తర్వాత కూడా మాలిష్‌కు
ఉపయోగించుకోవచ్చు. దీంతో శరీర చర్మం మృదువుగా ఉండటమే కాకుండా
మెరుస్తుంటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
0 Comments